- రన్నరప్ గా అన్ స్టాపబుల్ XI
- ముగిసిన క్రికెట్ టోర్నమెంట్
- మారబోయిన రాజ్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్ధం ఆర్.కే.వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో రసవత్తరంగా సాగిన పోటీలు

నమస్తే శేరిలింగంపల్లి: మారబోయిన రాజ్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్ధం ఆర్.కే.వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో నమో వెంకటేశాయ టీమ్ విజేతగా నిలిచింది. అన్ స్టాపబుల్ XI రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు భిక్షపతి యాదవ్, వెంకట్ రెడ్డి పటేల్, రాఘవేంద్ర రావు, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగుల్ గౌడ్, ఏళ్ళేశ్, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ రెండు జట్లకు మ్యాన్ ఆఫ్ ద సీరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అందజేశారు. కొన్ని రోజులుగా రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో పోటా పోటీగా తలపడి విజేతగా, రన్నరప్ గా నిలిచినా జట్లను సత్కరించి అభినందనలు తెలిపారు.
