- ఎం సిపిఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యుడు ఇస్లావత్ దశరత్ నాయక్
నమస్తే శేరిలింగంపల్లి: సాత్విక్ విషయంలో అధ్యాపకులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ.. నార్సింగ్ శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అధ్యాపకులను వెంటనే సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కామ్రేడ్ ఇస్లావత్ దశరథ్ నాయక్ డిమాండ్ చేశారు. సామాజిక వర్గానికి చెందిన సాత్విక్ పై నార్సింగ్ శ్రీ చైతన్య యాజమాన్యం వ్యవహరించిన తీరు విస్తు గొలిపేలా ఉందని అన్నారు. ర్యాంక్ తక్కువ వచ్చిందనే నెపంతో మధ్యాహ్నం భోజనం పెట్టలేదని, ఫీజు చెల్లించడం ఆలస్యమైన నేపథ్యంలో మండుటెండలో నిలబెట్టారని, కర్రలతో కొడితే శరీరం అంతా వాతలు తేలిందని, అతడు ఆత్మహత్య చేసుకునే ఒకరోజు ముందు కూడా అధ్యాపకులు తీవ్రంగా కొట్టినట్లు తెలిపారు. సాత్విక్ చనిపోయినప్పటికీ కనీసం ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులకు చెప్పేందుకు కూడా యాజమాన్యం నిరాకరించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని మంది పడ్డారు.
