పెబుల్స్ బే & ఎఫ్‌సీఐ కాల‌నీ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లో నూత‌నంగా ఏర్పాటైన 240వ డివిజన్ పరిధిలో పెబుల్స్ బే & ఎఫ్‌సీఐ కాల‌నీ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని రెండో వారంలో భాగంగా పెబ‌ల్స్ బే అపార్ట్‌మెంట్స్ నుండి ప్రశాంత్ నగర్ రోడ్, ఎఫ్‌సీఐ కాల‌నీ వరకు నిర్వ‌హించారు. అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో స్థానికుల‌కు త‌డి, పొడి చెత్త వేర్పాటుపై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సందర్భంగా అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రగతి ఎంక్లేవ్ అధ్యక్షుడు అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ ఇలాంటి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను ప్రతి ఆదివారం ఒక్కో కాలనీలో నిరంతరంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే శాశ్వత మార్పు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్‌మెంట్ నివాసితులు వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, శ్రీనివాస్, కృష్ణప్రసాద్, ఎం.ఎల్.ఎన్ రెడ్డి, వెంకటేష్, రంజిత్, శశాంక్, మల్లేష్, సత్యనారాయణ, లక్ష్మి, సునీత, అనిత, ఎఫ్‌సీఐ కాల‌నీ సభ్యులు శంకర్, విజయ్, పెంచల్ రెడ్డి, కిరణ్ కుమార్, భార్గవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here