నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి ఇందిరా నగర్ కాలనీ లో రూ. 1కోటి 75 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి , జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఇందిరా నగర్ కాలనీలో నెలకొన్న ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరినదని, మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారంగా దిశగా అడుగులు వేస్తున్నామని ,కాలనీ ప్రజలకు వర్షాకాలంలో నెలకొన్న ఇబ్బందులు, వరద ముంపు వంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకొని నేడు వరద నీటి కాల్వ నిర్మాణం పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. వరద నీటి కాల్వ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, పనులలో వేగం పెంచాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని డీఈ దుర్గ ప్రసాద్, ఏఈ సంతోష్ రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా, అంజద్ పాషా, సందీప్ రెడ్డి, ఇబ్రహీం, ఖాసీం, అశు, అజ్జు, రాహుల్ కాలనీ వాసులు పాల్గొన్నారు.