- ప్రపంచ నీటి దినోత్సవం లో నేతాజీనగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీ లో హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల మండలి ప్రపంచ నీటి దినోత్సవం 2024 (శాంతి కోసం నీరు) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని కాలనీ ప్రజలకు సూచించారు. ఈ ప్రపంచంలో మానవ మనుగడకు అత్యవసరమైనది ఏదైనా ఉంది అంటే అది నీరేనని గుర్తు చేశారు. నీటిని వృథాగా పోనీయకుండా పొదుపుగా వాడుకొంటే భావితరాలకు మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పారు. నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరీ బాధ్యతని అన్నారు.
కాలనీలో నీటి పొదుపు కోసం ర్యాలీ నిర్వహిస్తూ ఇంటింటికి నీటి పొదుపు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో జయశంకర్, ఈ కుమార్ ముదిరాజ్, కాంట్రాక్టర్ శేషు, రాజు నాయక్, రమేష్ నాయక్, పుష్పం మా రెడ్డి, శివమ్మ, అమ్మ, శివ లీల, నీలమ్మ, కమలమ్మ, జంగమ్మ,, నరేష్, బాలస్వామి, ఎండి సిరాజ్, నాగిరెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.