- ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి లలితా నగరేశ్వర దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాలా హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, బాబు మోహన్ మల్లేష్, కంది జ్ఞానేశ్వర్ , గోపి, పోలా కోటేశ్వరరావు, ఫౌండర్ చైర్మన్ వీరబొమ్మ, శ్రీనివాస్, ప్రెసిడెంట్ బాదం సాయిబాబు, వైస్ ప్రెసిడెంట్ బాలయ్య, వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ మారం వెంకట్, జనరల్ సెక్రెటరీ శంకర్రావు, ట్రెజరర్ వీరబొమ్మ, శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రభాకర్, జాయింట్ సెక్రెటరీ ఉషారాణి, వాణి, రాణి, జై కుమార్, ఆలయ సభ్యులు పాల్గొన్నారు.