- శ్రీ సీతా రామచంద్ర దేవాలయం అమ్మపల్లి నుంచి యాత్రను ప్రారంభించిన చెవేళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి శాసనసభ్యుడు వెంకట రమణా రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. శంషాబాద్ సమీపంలోని శ్రీ సీతా రామచంద్ర దేవాలయం అమ్మపల్లి నుంచి ఈ యాత్రను ప్రారంభించి మాట్లాడారు.
ఇందులో భాగంగా కామారెడ్డి శాసనసభ్యుడు వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలలో మొట్టమొదటిగా గెలిచేది చేవెళ్ల పార్లమెంటు అని తెలిపారు. దేశంలో నరేంద్ర మోడీపై ఉన్న అభిమానం చూస్తుంటే బిజెపి పార్టీ సునామీలో ప్రత్యర్థులందరూ అడ్రస్ లేకుండా కొట్టుకుపోవాల్సిందేనని యాత్రలో భాగంగా శేరిలింగంపల్లి బీజేపీ కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ తెలిపారు.