- చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
- చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ సాక్ష్యాలు, ఆధారాల అందజేత
- విచారణ చేపడతామని డీసీ హామీ
- ప్రజలకు ఉపయోగపడేలా న్యాయపోరాటం చేస్తానని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి వెల్లడి
నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ భూమిని ఆక్రమణ నుండి కాపాడి ప్రజా అవసరాల కోసం ఉపయోగపడేలా న్యాయ పోరాటం చేస్తానని మాజీ కార్పొరేటర్, అడ్వకేట్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 210లో కబ్జాకు గురైన రూ. 40 కోట్లు విలువైన జీహెచ్ఎంసీ భూమి వివరాలు వెల్లడించారు.
సుమారు 4000 గజాల పైన జీహెచ్ఎంసీ భూమిని స్థానిక ప్రజాప్రతినిధులు అండతో అధికారుల సహకారంతో పలువురు కబ్జాకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులను, ఆర్టీఐ ద్వారా సమాచారం అడుగగా తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. అయితే అది జీహెచ్ఎంసీ భూమి అని సాక్ష్యాలు, ఆధారాలతో సహా చందానగర్ సర్కిల్21 డిప్యూటీ కమిషనర్ కు ఇచ్చినట్లు తెలిపారు.
దీనికి ఆయన సానుకూలంగా స్పందించి విచారణ చేపడతామన్నారని చెప్పారు.