కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

  • పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. టిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాయనంద్ గుప్తా, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి, మాధవరం రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని రాబోయే పార్లమెంట్ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు. పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఆ ఇద్దరిని ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here