ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే గాంధీ

  • సిఎస్ఆర్ సేవలు అభినందనీయమని ప్రశంస

నమస్తే శేరిలింగంపల్లి: సమ్ టోటల్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ పేద విద్యార్థులకు, పేద ప్రజలకు సామజిక సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గాంధీ, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధి న్యూ కాలనీలోని మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం “సమ్ టోటల్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్” ఆధ్వర్యంలో రూ. 15 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే అదనపు తరగతి గదులు నిర్మాణ పనులకు ఆ సంస్థ డైరెక్టర్ ఉషశ్రీ , మియాపూర్ డివిజన్ నాయకులు, కాలనీ వాసులతో కలసి వారు పాల్గొని శంకుస్థాపన చేశారు.

ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం పనులకు ముందుకొచ్చిన సి ఎస్ ఆర్ సంస్థ ప్రతినిధులను అభినందిస్తున్న ఎమ్మెల్యే గాంధీ

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజము కోసం ఏదో చేయాలనే తపనతో.. సమాజ హితం సమాజ సేవ చేయడం చాల గొప్ప విషయమన్నారు. ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుడదనే ఉద్దేశ్యంతో సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎంతో ఓదార్యం తో గదులు నిర్మిస్తున్నారని ,త్వరితగతిన పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని తెలిపారు.

పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం…

మంచిగా చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విద్యార్థులకు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్ ఎం రాంమోహన్ రావు, ఉపాధ్యాయులు అర్చన, విజయ, వనజ, విద్యార్థులు మరియు మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here