చెరువుల కబ్జాకు పాల్పడితే సహించం

  • ఒక కిలో మీటరు మేర సున్నం చెరువు కబ్జా
  • ప్రేక్షక పాత్రలో ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసి అధికారులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గాంధీ
    సున్నం చెరువు ను సందర్శన

నమస్తే శేరిలింగంపల్లి: చెరువుల కబ్జాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హెచ్చరించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువు కబ్జాకు గురవుతున్న విషయం తెలుసుకోని ఇరిగేషన్ , రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.

సున్నం చెరువు పరిధిలోని ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లో నంబర్ 16 లో మట్టి తో పూడ్చి అక్రమంగా ప్రహరి గోడలు నిర్మించి, అక్రమ కట్టడాలు చేస్తున్న భూ కబ్జాదారుల పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువును పరిరక్షించాలన్నారు. రెవెన్యూ , ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో చెరువు కబ్జాకు గురి అవుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పార్లమెంట్ సభ్యుని గా , ప్రతిపక్ష నేత గా ఉన్న సమయంలో చెరువును సందర్శించి, చెరువు కబ్జాల నుండి కాపాడాలని కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా నేటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు.

చెరువు కబ్జాకు గురి కావడం పై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ

భూ కబ్జాదారుల పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిదిలో జరుగుతున్న నిర్మాణాలను వెంటనే కూల్చి వేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ సీఈ, సైబరాబాద్ సీపీ లకు లేఖ రాసినట్లు తెలిపారు. ఇకనైనా అధికారులు మేల్కొని అక్రమ కట్టడాలు కూల్చివేసి చెరువును యథాస్థితికి తీసుకురావాలని, చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి, చెరువు మళ్ళీ కబ్జాకు గురి కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ నరేందర్, ఏఈ లక్ష్మీ నారాయణ, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రాజ్ కుమార్, జీహెచ్ఎంసి అధికారులు డిఈ ఆనంద్, ఏఈ రంజిత్ మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సహదేవ్ , సాయి, హరికృష్ణ పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here