- అరుదైన లక్షణాలతో శిశువు జననం
- 14 గంటలపాటు సవాలుతో కూడిన శస్త్ర చికిత్స
- శిశువును కాపాడిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్య బృందం
- పది రోజుల్లో డిశ్చార్జ్ కానున్నట్లు వెల్లడి
నమస్తే శేరిలింగంపల్లి: మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ బృందం అరుదైన శస్త్ర చికిత్స చేసి 16 నెలల శిశువును కాపాడారు. వివరాలు.. టాంజానియాకు చెందిన 16 నెలల శిశువు అరుదైన పుట్టుకతో వచ్చిన వైకల్యంతో (శరీరం వెలుపల గుండెతో, ఉదరభాగంతో ) జన్మించింది. ఇది భారతదేశంలో నే మొదటిది. TIBA హాస్పిటల్ సహకారంతో టాంజానియాలోని దార్ ఎస్ సలామ్‌లోని మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ ఔట్‌రీచ్ OPDలో రోగి నిర్ధారణ కావడంతో శస్త్రచికిత్స కోసం చిన్నారిని భారత్‌కు తీసుకువచ్చారు.
వైద్యులు ఆశిష్ సప్రే, శ్రీనివాస్ కిని, మధు మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి పరిగే, పవన్ ప్రసాద్, మధు వినయ్, సంధ్య (పీడియాట్రిక్ అనస్థీసిస్ట్ ) , నిర్మల్ రెడ్డి (పీడియాట్రిక్ అనస్థీసిస్ట్ ) ప్రత్యేక నర్సింగ్ బృందం నేతృత్వంలో ఫిబ్రవరి 22న 14 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. 10 రోజులలోపు డిశ్చార్జికి సిద్ధంగా ఉందని తెలిపారు.
పెంటలజీ ఆఫ్ కాంట్రెల్ (గుండె, ఛాతీ గోడ, ఉదర ప్రాంతాలను ప్రభావితం చేసే సంక్లిష్ట లోపాల పుట్టుకతో జన్మించిన పాపకు గుండె ఛాతీ కుహరం వెలుపల కొట్టుకోవడం, చర్మంతో మాత్రమే కప్పబడి ఉండటం, ప్రేగులు, ఇతర ఉదర అవయవాలు బయటకు పొడుచుకు వచ్చి పలుచని పొరతో కప్పబడి ఉండటం) అనేది చాలా అరుదైన పుట్టుకతో వచ్చే రుగ్మతని , దీనికి శస్త్ర చికిత్స సవాలుతో కూడుకున్నదని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ సప్రే తెలిపారు. మల్టీడిసిప్లినరీ స్పెషలిస్ట్ బృందం మధ్య సహకారం, మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ యాజమాన్యం సహకారంతో.. హాస్పిటల్ లో అధునాతన సౌకర్యాలు ఈ శస్త్ర చికిత్స విజయవంతం అవ్వడానికి దోహదం చేస్తాయని చెప్పారు.
మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్ పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మధు మోహన్ రెడ్డి మాట్లాడుతూ 55 లక్షల మందిలో ఒక్కరే ఇలా పుడతారని, ప్రపంచంలో ఇప్పటివరకు 90 మందిని మాత్రమే చూశామని, భారతదేశంలో మొట్టమొదటిది ఈ శిశువుకి జరిగిన సర్జరీ అని పేర్కొన్నారు.
సివిటి సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ కిని మాట్లాడుతూ సవాలుతో కూడిన శస్త్ర చికిత్స విజయవంతం చేయడంలో తమ బృందం సమన్వయ కృషి దోహదపడిందని చెప్పారు.