నమస్తే శేరిలింగంపల్లి : ఏ చిన్నారి పోలియో బారిన పడకుండా ఉండాలంటే పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ కోరారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని పల్స్ పోలియో కేంద్రాలకు వెళ్లి, స్థానిక నాయకులతో కలసి పలువురు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రధమ కర్తవ్యంగా తమ చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించటం మర్చిపోవద్దని అన్నారు.
పోలియో మహమ్మారి వల్ల ఎంతోమంది జీవితాలు ఆగమ్యాగోచారం అయ్యాయని, ఈ రోజు అలసత్వం మన బిడ్డల రేపటి భవిష్యత్తు చీకటి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రూప రెడ్డి, డా రమేష్, మంగమ్మ, తిరుపతి యాదవ్, గిరిగౌడ్, యాదగిరి, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, మొహ్మద్ ఖాసీం, బాలకృష్ణ, శేఖర్ యాదవ్, షణ్ముఖ్, రమాదేవి, లక్ష్మి ప్రభ, సాహితీ, వేదాంషి పాల్గొన్నారు.