ప్రతి విద్యార్థి గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : మెరుగైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని కానుకుంటలోని ‘‘మైత్రీ హై స్కూల్’’ లో నిర్వహించిన “సైన్స్ ఫెయిర్” కార్యక్రమంలో పాల్గొన్న ఆయనతోపాటు విశిష్ఠ అతిథులుగా డైరెక్టర్ ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా, సైంటిస్ట్ రఘునందన్ కుమార్ , శ్రీనివాస్ రావులకు స్కూల్ యాజమాన్యం శాలువాతో సత్కరించి పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… సమాజాన్ని మార్చే శక్తి కేవలం ఉపాధ్యాయులకే ఉందన్నారు.

‘‘మైత్రీ హై స్కూల్’’ లో నిర్వహించిన “సైన్స్ ఫెయిర్” కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

సమాజానికి గొప్ప శాస్త్రవేత్తలను, మేధావులను అందించే విధంగా ప్రతీ ఉపాధ్యాయుడు అంకితభావంతో పని చేయాలన్నారు. విద్యార్థులు సైన్స్ ఫెయిర్ లో కనబరచిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయని, టెక్నికల్ గా అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న ఈ తరానికి విద్యతోపాటు ఎన్నో రకాలైన ఆసక్తికర నైపుణ్యతలను తెలియపరచడానికి ఇలాంటి సైన్స్ ఫెయిర్ ప్రోగ్రాంలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పి. సత్యనారాయణ, ప్రిన్సిపల్ రత్న కుమారి, లింగంపల్లి విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ రవి యాదవ్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, తుకారం, స్కూల్ స్టాఫ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here