- జాగృతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాలును ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్
నమస్తే శేరిలింగంపల్లి : ఒక కాలనీలో ఉంటూ కుటుంబ సభ్యులుగా కలసి మెలసి, కష్టాసుఖాలను పంచుకుంటూ తోడ్పాటు అందించుకుంటూ ఉండటం అభినందించదగిన విషయమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని జాగృతి కాలనీలో జాగృతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాలును ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జాగృతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలసి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ కలసికట్టుగా కాలనీ కుటుంబ సభ్యులు ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయమని అన్నారు. ఈ సందర్బంగా జాగృతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. గత మూడు సంవత్సరాలనుండి ఈ జాగృతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రామకృష్ణ, అసోసియేషన్ సభ్యులు ఎంతో శ్రమించారని అన్నారు.