నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి పనులలో వేగం పెంచాలని, అధికారులందరు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అభివృద్ధి పనులు విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి స్థితిగతుల పై చర్చించామని తెలిపారు. పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని, కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని, కొత్త ప్రతిపాదనలకు నిధులు మంజూరి అయ్యేలా చూడాలని, వర్షాకాలం లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ శ్రీనివాస్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.