నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక బోనాల పర్వదినం సందర్భంగా భారతినగర్ డివిజన్ పరిధిలోని ఎం ఐ జి కాలనీలోని లలిత పోచమ్మ తల్లి దేవాలయం వద్ద మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఫలహారం బండి ఊరేగింపుని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదర్శ్ రెడ్డి, మిర్యాల రాఘవరావు, బాలింగ్ గౌతమ్ గౌడ్, జనార్ధన్ రెడ్డి, కర్ణాకర్ గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్ రాజు, భాస్కర్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, నాగమణి, జ్యోతి పాల్గొన్నారు.