సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎం ఆర్ ఎఫ్ ద్వారా రూ. 2 లక్షల 19 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. మియాపూర్ కి చెందిన సత్యవతికి రూ. 2 లక్షలు, వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీ కి చెందిన సుమలతకి రూ . 19 వేలు అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, ప్రసాద్, కాశినాథ్ యాదవ్ , రాము పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here