-
ఎమ్మార్వో కు మెమొరాండం సమర్పణ
నమస్తే శేరిలింగంపల్లి: శేరి లింగంపల్లిలో అర్హులైన పేదలకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్ కు విన్నవించారు. శేరి లింగంపల్లి
బిసి ఐక్యవేదిక ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, బి ఎస్.పి కాంటెస్ట్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్, లింగంపల్లి గోపాల్ ముదిరాజ్, బీసీ లింగం, హైమద్ బాబు యాదగిరి యాదవ్, కృష్ణ ముదిరాజ్
కార్యవర్గం సభ్యులు, అభిమానులు శేరి లింగంపల్లి మండల కార్యాలయంలో తహసిల్దార్, డిప్యూటీ కలెక్టర్ కి మెమొరాండం సమర్పించారు. అనంతరం ఎమ్మార్వోతో చర్చలు జరిపారు.
అర్హులైన సొంత స్థలం ఉన్న పేదలకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని, స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో 60 గజాల స్థలం కేటాయించి ఇల్లు కట్టుకూటానికి, ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని బేరి రామచందర్ యాదవ్ , శేరి లింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, కోరారు.