- హెచ్ఎండిఏ అధికారులకు ఎంసీపీఐ (యూ) నాయకుల వినతి
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని ముజఫర్ అహమ్మద్ నగర్ లో 35 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇచ్చిన నోటీసులను ఉపసవారించుకోవాలని ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ నాయకత్వం డిమాండ్ చేసింది.
అమీర్ పేట్ మైత్రి వనంలోని హెచ్ఎండీఏ కార్యాలయంలోని హెచ్ఎండిఏ కమిషనర్ కి, సెక్రటరీ కి ఎస్టేట్ ఆఫీస్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐ(యూ)గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో అరకొర జీవితాలను కొనసాగిస్తూ సంవత్సరాల తరబడి నిలువ నీడ ఏర్పాటు చేసుకున్న బడుగు బలహీన వర్గ ప్రజలకు హెచ్ఎండిఏ అధికారులు నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ ఇస్లావత్ దశరథ్ నాయక్, తాండ్ర కళావతి, అంగడి పుష్ప, పి. భాగ్యమ్మ పాల్గొన్నారు.