- జీహెచ్ఎంసీ సిబ్బందికి ఆదేశించిన శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : రహదారుల పరిశుభ్రత విషయంలో సిబ్బంది మరింత శ్రద్ధగా పని చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి సూచించారు. వ్యర్థాలను వెను వెంటనే తొలగించాలని, ఎటువంటి నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. అనంతరం బస్తీ దవాఖాన, అన్నపూర్ణ సెంటర్లు కూడ పరిశీలించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో అన్నపూర్ణ సెంటర్లు మరిన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బయో డైవర్సిటీ, కొత్తగూడ కూడళ్లు, రాడిసన్ హోటల్ రోడ్, మస్జీద్ బండ, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలలో జెడ్సీ ఉపేందర్‌రెడ్డి బుధవారం పర్యటించి పారిశుద్ధ్య పనులతోపాటు రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ కూడళ్ల నిర్వహణను మరింతగా మెరుగు పరచాలని, రహదారుల పక్కన ఇసుక మట్టి పేర్కొనకుండా ఎప్పటికపుడు శుభ్రం చేయాలని సూచించారు.
సర్కిల్‌లో డీసీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు పర్యవేక్షక అధికారులు రోజువారీ పారిశుద్ధ్య పనులను పరిశీలించాలని, ఎటువంటి లోటు ఉన్నా తక్షణ సవరణ చర్యలు చేపట్టాలన్నారు. జెడ్సీ వెంట డీసీ 20వ సర్కిల్, ఏఎంహెచ్ఓ డాక్టర్ నాగేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.