నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఛైర్మన్ పదవి స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు వీరమల్ల వీరేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పత్రి దినేష్ రాజ్, జీహెచ్ఎంసీ టీపీసీసీ లేబర్ సెల్ ఛైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, వైస్ చైర్మన్ బి.కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి ముద్దంగుల పాల్గొన్నారు.