నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జూలై 15న నిర్వహించే చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి అన్ని కుల సంఘాలు రావాలని రెండు తెలుగు రాష్ట్రాల బీసీ ఐక్యవేదిక చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో చేపడుతున్న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ బీసీ కులాలన్నీ ఏకమై విద్యార్థుల పక్షాన పోరాడి విద్యార్థులకు ఉద్యోగాలు అవకాశాలు, ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రభుత్వాలు కల్పించడమే లక్ష్యంగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే చదువుకున్న ఉద్యోగులకు ఉద్యోగాల కల్పన చేయాలని అన్నారు. శేరిలింగంపల్లి బీసీ వేదిక అధ్యక్షుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీల కులగణనలను వెంటనే చేపట్టాలని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ బీసీలకు న్యాయం జరిగే విధంగా దామాషా పద్ధతిని రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. బీసీ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయిందని, విద్యార్థులు, ఉద్యోగాలు లేక మత్తుకు బానిసలతున్నారని, ప్రభుత్వం వెంటనే వారికి ఉద్యోగాలు కల్పించాలన్నారు.