నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక శ్రావణమాసం బోనాల పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్, బాపు నగర్, గోపి నగర్ కాలనీలలో ఫలహారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఫలహారం బండి ఊరేగింపుని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అమ్మ వారి దీవెనలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘనాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పొడుగు రాంబాబు, పద్మారావు, కృష్ణ యాదవ్, ప్రసాద్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, రామరాజు, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, నటరాజు, పవన్, రవి యాదవ్, రేవంత్, నర్సింహ రెడ్డి, జమ్మయ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు.