నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సేవకుడు.. అన్నా అంటే నేనున్నాననే వ్యక్తి తమ భిక్షపతి యాదవ్ అని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. పేదల ఆకాంక్ష తీరుస్తానని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు.
గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా హఫీజ్ పెట్ డివిజన్ సుభాష్ నగర్, హుడా కాలనీలో మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, దేవాల్ యాదవ్, రవి గౌడ్ ఎల్లేష్, రమణయ్య, వినయ, శ్రీనివాస యాదవ్ గార్లతో పాదయాత్ర నిర్వహించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుబడి, అమ్మానాన్న లేని అనాధగా మారిపోయిందని, రాజకీయాలంటే కేవలం కబ్జాలు, డబ్బులు సంపాదించడమే ఏకైక లక్ష్యంగా ఎంచుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నంతవరకు ప్రజలకు న్యాయం జరగదని బిక్షపతి యాదవ్ అన్నారు.
తన తండ్రి చూపిన బాటలో నడిచి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నానని, మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్మునిగా, ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపి పేద ప్రజల ఆకాంక్షలు తీరుస్తానని రవి కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రవి ముదిరాజ్ గణేష్ ముదిరాజ్, అశోక్ ,రమేష్ శ్రీనివాస్, రాజు, రాము, రమేష్, శివ నరసింహ, దేవానంద్ పాల్గొన్నారు.