లక్ష్యం ఏర్పరచుకొని సాధించే దిశగా కష్టపడి పడాలి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: సమాజ హితం.. సమాజం కోసం సహాయం చేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పురుషోత్తం, రామప్రభు ఆధ్వర్యంలో ఉచిత నోట్ పుస్తకాల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, హమీద్ పటేల్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందచేయడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.

ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అన్నారు. ట్రస్ట్ సభ్యులు పురుషోత్తం, రామప్రభులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకొని సాధించే వరకు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here