తెలుగు వెలుగు నందమూరి తారక రామరావు

  • ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి
  • నివాళి అర్పించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేష్, సిర్పూర్ కాగజ్ నగర్ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ 

నమస్తే శేరిలింగంపల్లి: నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతిని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మియపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ మెట్రో డిపో రోడ్డులోని త్రివేణి సర్కిల్ హుడా మయూరి నగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

త్రివేణి సర్కిల్ హుడా మయూరి నగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న ముఖ్య అతిథులు

అనంతరం సాయి బాబా ఆలయం వద్ద ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేష్, సిర్పూర్ కాగజ్ నగర్ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు.

సమష్టిగా నివాళి అర్పిస్తూ…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు భాషకు, తెలుగు వారికి గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని, నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలి.. అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించి ఎంతోమందికి దైవంలా నిలిచారని కొనియాడారు. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజయాలు, చేసిన మంచి పనులు అలాంటివి అని అన్నారు.

అన్నదాన కార్యక్రమంలో భోజనం వడ్డిస్తున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేష్, సిర్పూర్ కాగజ్ నగర్ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ 

కార్యక్రమంలో నాయకులు కూన సత్యం గౌడ్, నాగేశ్వరరావు, కావూరి ప్రసాద్, మనెపల్లి సాంబశివరావు, ఇలియస్ షరీఫ్, వీరేందర్ గౌడ్, బాష్పక యాదగిరి, మయూరి నగర్ అధ్యక్షులు నారాయణ రావు, కావూరి మధు, రాజేంద్ర ప్రసాద్, కిషోర్, అమర్, స్వరూప్, తిరుపతి, గోపాల్, ప్రభాకర్, వెంకన్న, సాయి యాదవ్, రమేష్, రవి కుమర్, శివాజీ, నరేందర్ ముదిరాజ్, పూర్ణ కలపల, ప్రేమ, పరుచూరి వెంకటేశ్వర రావు, సుబ్రహ్మణ్యేశ్వర్ రావు, రాజేష్ దేవినేని, పాలడుగు ప్రసాద్, రాజేష్, వాసు, శ్రీనివాస్, హేమాద్రి నాయుడు, శివ, వినోద్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here