- పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్.గడ్డం రంజిత్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలి..
- శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ పీజేఆర్ ఫంక్షన్ హాల్ లో విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారని, అన్ని వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇవ్వడం హర్షించదగ్గ విషయమని, మహిళ సాధికారిత కోసం మహిళ పొదుపు సంఘాలకు నిధులు విడుదల చేయడం ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం అని కొనియాడారు.
మహిళ సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పని చేస్తుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, కూన సత్యం, భాషిపాక నాగమణి యాదగిరి, ఉప్పల విద్య కల్పనా ఏకాంత గౌడ్, ముకయ్య, వెంకటస్వామి సాగర్, ఆల్వాల భాస్కర్, లక్ష్మి, మారుమాముల మల్లేష్, మంజు యాదగిరి, దుర్గ రావు, నాగుల మల్లేష్, పరుశురాం, పద్మ, భూషయ్య, ఆల్వాల రమేష్, డీజే రాజు, సంధ్య రాణి, దయాకర్ రెడ్డి, శృతి, జితేందర్, అశోక్, రాజు, విమల్ శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.