నమస్తే శేరిలింగంపల్లి : రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి డివిజన్ లోని ఇందిరానగర్ మస్జీద్ ఈ హాజ దిలావర్ష బేగం మస్జీద్ లో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయనను ముస్లిం పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్థానిక మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ 30 రోజులపాటు ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆచారమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, సయ్యద్ అజ్జు, మొహమ్మద్ ఆఫ్జల్, మోహముద్, సత్తర్, గోపాల్ యాదవ్, సుధాకర్ రెడ్డి, రవీందర్, సలీం, రహీం, హసీమ్, షఫీ, ఇబ్బు, షఫీ, ఏక్బల్, అజీమ్, ఫరీద్, ఖాసీం, నదీమ్, తదితరులు పాల్గొన్నారు.