పార్టీకి కార్యకర్తలే బలం.. అండగా నిలుస్తాం.. తోడుగా అడుగేస్తాం

  • జీవితమంతా ప్రజా సేవకే అంకితం
  • చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ రంజిత్ రెడ్డి
  • శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా : అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా నర్సింహ రెడ్డి
  • కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుంది: శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
  • బీఆర్ఎస్, బీజేపీ పార్టీల 500 వరకూ కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ పూజిత గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో చేవెళ్ల అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు, అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా నర్సింహ రెడ్డి పాల్గొని కార్యకర్తలు, నాయకులు దిశా నిర్దేశం చేశారు.  అంతేకాక బీఆర్ఎస్, బీజేపీ నుంచి 300 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరగా.. వారిని సాదరంగా ఆహ్వానించి వారినుద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు హనీఫ్, హమీద్, కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ గుజ్జుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హరీష్, ఎండి యాకూబ్, నాగేష్, ఎం.శ్రీనివాస్, కే.ప్రశాంత్, సిహెచ్ రణధీర్, గౌతమ్, అరుణ్ కుమార్, వంశీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి , మహిళలు శ్రావణి, పార్వతి, కవితలతో పాటు మరికొంతమంది పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అప్పులపాలు చేస్తుందని, శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం చేయడంతోపాటు కార్యకర్తలను కాపాడుకుంటానని, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానని, ప్రతి కార్యకర్త అండగా ఉంటామని, అభివృద్ధే ప్రధాన ఎజెండగా ముందుకు సాగుతామని తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న జగదీశ్వర్ గౌడ్.. చిత్రంలో చల్లా నర్సింహారెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి

డాక్టర్.జి.రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలు పోటీకి ముందే చతికిల పడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎంపీ గెలుస్తే మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందని అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేయాలని కోరారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే పార్లమెంట్ లో మీ గొంతుకై ఉంటా, ప్రజా సేవకే జీవితాంతం పనిచేస్తానని , రానున్న ఎంపీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదం ఈసారి బలంగా ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సిటీకి ఆనుకుని ఉన్న శేరిలింగంపల్లి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన శేరిలింగంపల్లి లో మెజార్టీ సాధించి ఎంపీని కానుకగా అందిద్దాం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్, బిజెపి పార్టీ నుంచి సుమారు 500 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here