నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వార్డ్ సభ్యుడు నర్సింహారెడ్డి ( వేణు) ఇటీవల అనారోగ్యo కు గురై ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకుని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, MD ఇబ్రహీం, అనిల్ పాల్గొన్నారు.
