అంబరాన్నంటిన కేనరి ద స్కూల్ 7వ వార్షికోత్సవ వేడుక

  • అబ్బురపరిచేలా నృత్యాలు చేసిన చిన్నారులు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పకళా వేదికలో కేనరి ద స్కూల్ 7వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ .శివరంజని సంతోష్, ఆదిలక్ష్మి చింతలపాటి, పాఠశాల సలహాదారులు, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ రెడ్డి, చైర్ పర్సన్ శ్వేతా రెడ్డి చప్పిడి, డైరక్టర్ సమలత ఉప్పలపాటి, ప్రిన్సిపాల్ అపర్ణ ప్రసాద్ చెరుకూరి, అడ్మిన్ మేనేజర్ మహేష్ అక్కం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ వేడుకలో The legends of the seven ( elements of nature) Expression of life ( నవరసాలు) అనే అంశాలపై రూపొందించిన పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతో అలరించాయి. విద్యార్థులు అబ్బురపరిచేలా నృత్యాలు చేశారు.

కేనరి ద స్కూల్ 7వ వార్షికోత్సవ వేడుకలో నృత్యాలు చేస్తున్న చిన్నారులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here