నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ లోని పెద్ద కుడి చెరువు సుందరీకరణలో భాగంగా రూ.199 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అలుగు, కల్వర్టు నిర్మాణం పనులకు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పేట్ లో కుడి కుంట చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్ట పటిష్టం చేసేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం, అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు చెరువులను సంరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు DE నళిని, AE నాగరాజు , బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పురుషోత్తం యాదవ్, గంగాధర్, BSN కిరణ్ యాదవ్, మోహన్ ముదిరాజు, మాధవర గోపాల్ రావు, శ్రీనివాస్ గోపారాజు, రఘునాథ్, వెంకటేశ్వర్లు, కాజా, రాజేష్ గౌడ్, నర్సింగ రావు, మల్లేష్, స్వామి నాయక్, శ్రీకాంత్ , అమరేందర్ రెడ్డి , ఎజాజ్, సుధాకర్, చందు, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, తిరుపతి, రోజా, వరలక్షి, సుప్రజ పాల్గొన్నారు.