నమస్తే శేరిలింగంపల్లి : ఎన్నికల్లో తమ పూర్తిస్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకేనని ముక్తకంఠంతో నినదించారు మై హోమ్ నవదీప అపార్ట్మెంట్స్ వాసులు. కొండాపూర్ డివిజన్ పరిధిలో మై హోమ్ నవద్విప అపార్ట్మెంట్స్ వాసులతో ఆత్మీయ సమావేశం వేడుకగా జరిగింది. ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఆయన సతీమణి శ్యామల దేవి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవల్సిందిగా కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అభివృద్ధి చేశామని, ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని, మహిళ పక్షపాతి, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.