నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో దీపావళి పండుగ పురస్కరించుకొని యంపీ థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బెంగళూరు నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి కుమారి శ్రీష్టి పండరి తన ప్రదర్శనలో కీర్తన, శబ్దం, దేవర్ణమా , అష్టపది అభంగ్ అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
నృత్యాంజలి డాన్స్ అకాడమీ గురువు ప్రసన్నమోహన్ శిష్య బృందం ప్రదర్శనలో అలరిపు, మూషిక వాహన, కౌత్వం, శబ్దం, పదం, దేవి స్తుతి, దుర్గే దుర్గే, నటనమాడిన, అర్ధనారీశ్వరాష్టకం అంశాలను శ్రీప్రియ, నేహశ్రీ, సంజన, యశస్వినీ, శివాని, వర్ష, శ్రీహిత, పియూష జోషిక, ఆరాధ్య మొదలైన ప్రదర్శించి మెప్పించారు.