నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని న్యూ కాలనీలో బీహెచ్ ఈఎల్ ఎంఐజి రామాలయం దగ్గర ధరణి మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ఉన్నతిని చేకూర్చే చేతి కళగా ముగ్గులను గుర్తించి కొమిరిశెట్టి ఫౌండేషన్, విజేత సూపర్ మార్కెట్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి.
ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రాచీన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకలే పండుగలని అన్నారు. ఈ పోటీలలో న్యాయనిర్ణేతలుగా టి. వరలక్ష్మి , విజయలక్ష్మి వ్యవహరించారు. గోదావరి అంజిరెడ్డి, శాంతిశ్రీ (సెంట్రల్ ఎక్సైజ్ సూపరిండెంట్) అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక మహిళా నాయకురాలు వరలక్ష్మి (న్యూ కాలనీ), ధరణి మహిళా సంఘం నాయకురాళ్ళు రజని, ఉమాపతి, లక్ష్మీ రమాదేవి, రత్న కుమారి, రేణుకా దేవి, సాయిసుధ, దివ్య, వాణి, సుధ పాల్గొన్నారు.