శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెలలో నిర్వహించే శేరిలింగంపల్లి నియోజకవర్గం బీసీ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సభను జయప్రదం చేయాలనీ ప్రముఖ సామాజిక వేత్త, మిర్యాల చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిర్యాల ప్రీతం అన్నారు. రానున్న రోజుల్లో బీసీ కులాలకు తగిన ప్రాధాన్యత ఉంటుందనీ, 42 శాతం రిజర్వేషన్ అమలు కు ప్రభుత్వాలు కృషి చేయాలనీ, అందుకు తామంతా ఐకమత్యంగా ఉన్నామని తెలిపారు. సభ విజయ వంతానికి తమ వంతు ఆర్థిక సాయం అందజేశారు. ఇకముందు కూడా అండగా ఉంటామని, బీసీ రాజ్యాధికారం దిశగా కృషి చేయాలనీ పేర్కొన్నారు. ఒక కార్యాచరణ రూపొందించి, ఆ దిశగా పని చేయాలనీ, అందరూ కలిసి కట్టుగా ఉంటూ హక్కుల సాధనకు పోరాటం చేయాలనీ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.