శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): గురుపౌర్ణమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ రవీంద్ర ముదిరాజ్, స్థానిక నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలోని సాయిబాబా టెంపుల్ లో నిర్వహించిన ప్రత్యేక పూజలలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురు పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ గురుపౌర్ణమి పండుగ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ రవీంద్ర ముదిరాజ్, సీనియర్ నాయకులు శుద్ధపల్లి విజయ కృష్ణ, శ్రీకాంత్ గౌడ్, కొల్లూరి, మధు ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, అజయ్, సత్యేందర్ సింగ్, సంతోష్ కుమార్, రాజేష్ యాదవ్, మురళి మోహన్, రాజేష్ యాదవ్, కచ్చావా దీపక్ తదితరులు పాల్గొన్నారు.