శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): బోనాల పండుగ సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గ్రామ దేవాలయాల వద్ద కనీస వసతులు ఏర్పాటు చేయాలని హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ బోనాల పండుగ సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గ్రామ దేవాలయాల వద్ద కనీస వసతులను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. గత సంవత్సరం బోనాల పండుగ సందర్భంగా అరకొర వసతులతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. శాంతి నగర్ , హుడా కాలనీ , గంగారం , మదీనా గూడ , హఫీజ్ పేట్ గ్రామం , ఆల్విన్ కాలనీ , ప్రజయ్ సిటీ , సాయి నగర్ లో గ్రామ దేవాలయాల పరిసరాలు శుభ్రపరచడం, దేవాలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయడం, దేవాలయాలకు వెళ్ళే రోడ్డు మరమ్మత్తు చేయడం, దేవాలయాల వద్ద మంచి నీరు ఏర్పాటు చేయడం, మహిళలు అమ్మవారికి బోనాలు సర్పించే వరకు సంబంధిత అధికారులను, దేవాలయం వద్ద ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.
మైహోమ్ జెవెల్ నుండి సరస్వతీ విద్యా మందిర్ వరకు నూతన రోడ్డు ఏర్పాటులో నాణ్యత పాటించాలన్నారు. మంజీర పైపు లైన్ రోడ్డు మైహోమ్ జెవెల్ నుండి సరస్వతీ విద్య మందిర్ వరకు నూతన రోడ్డు ఏర్పాటులో కనీస నాణ్యత పాటించకుండా , రోడ్డు గుంతల్లో బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ వేసి , గుంతలను పూడ్చటంతో , రోడ్డు నాణ్యత లేకుండా వేస్తే , కొన్ని రోజులకు రోడ్డు మొత్తం డ్యామేజ్ అవుతుందన్నారు. కనుక సంబంధిత అధికారులచే పర్యవేక్షించి సమస్యని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , మాజీ కౌన్సిలర్ రమణయ్య ,డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు , బీజేపీ నాయకులు నరసింహ యాదవ్ , రాజశేఖర్ , లోకేష్ , గోవింద్ పాల్గొన్నారు.