స‌మాజంలో గురువుల‌కు విశేష‌మైన స్థానం ఉంది: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూలై 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఫేస్ 2 లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా జరిగిన వేడుకలలో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమార్గంలో ముందుకు నడిపించే జ్ఞానదాతలైన గురువులకు నమస్సులతో గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. సనాతన భారతీయ సంప్రదాయంలో గురువుకు విశేషమైన స్థానం ఉంది. ఏ తరహా విద్యను నేర్పే గురువైనా పూజనీయుడే! తల్లి దండ్రుల తరవాత అంతటి సమున్నతమైన స్థితి గురువులది. ఆచరించి చూపి విద్యార్థులకు ఆలంబనగా నిలిచేది ఆచార్యుడు. శ్రద్ధాసక్తులతో, భక్తి విశ్వాసాలతో గురువు నుంచి జ్ఞానాన్ని అందుకునే విద్యార్థికి భవిష్యత్తు బంగారు మయమవుతుంది అని మనుస్మృతి ప్రస్తావించింద‌న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సుప్రజ ప్రవీణ్, మిరియాల రాఘవరావు, ఉరిటీ వెంకట్ రావు, శ్రీనివాస్ నాయక్, రాజయ్య , సందీప్ రెడ్డి, భ‌క్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here