శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): జీవితంలో మంచిగా ఉండడం, సన్మార్గంలో నడవడం, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో మనకు ఎల్లప్పుడూ సరైన సూచనలు, సలహాలు ఇచ్చే గురువు పాత్ర చాలా కీలకమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు ఆల్విన్ కాలనీ డివిజన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్ రావు ఆధ్వర్యంలో ఎస్.ఎస్.డి గ్రామర్ స్కూల్ ప్రాంగణంలో నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ గురుపౌర్ణమి వేడుకలు, హఫీజ్ పేట్ డివిజన్, హుడా కాలనీ లోని లక్ష్మీ గణపతి ఆలయం వద్ద కంటేస్టెడ్ కార్పొరేటర్ అనూష మహేష్ యాదవ్, బీజేపీ మహిళా మోర్చ పార్లమెంట్ కో కన్వీనర్ పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పారాయణం, ఆషాఢమాస గోరింటాకు సంబరాలలో పాల్గొని గురువులను రవికుమార్ యాదవ్ సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు చిన్నతనంలో అన్ని నేర్పే గురువులుగా తల్లిదండ్రులు, తర్వాత చదువు , విజ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయులు ఇలా వారు మాత్రమే కాకుండా జీవితంలో మంచిగా ఉండడం, సన్మార్గంలో నడవడం, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో మనకు ఎల్లప్పుడూ సరైన సూచనలు, సలహాలు ఇచ్చే ప్రతి ఒక్కరు గురువుతో సమానమే మనం ఈరోజు అలాంటి వారిని సన్మానించుకుని వారికి మన కృతజ్ఞతలు తెలుపుతుంటాం ఎందుకంటే గురువు దేవుడితో సమానం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజవర్గ, డివిజన్ , మహిళా మోర్చ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





