శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలకి చెందిన పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.6,00,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF LOC మంజూరు పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పురెందర్ రెడ్డి, నాని, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.






