గుల్‌మోహ‌ర్ కాల‌నీలో ఘనంగా గురు పౌర్ణ‌మి వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, జూలై 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గురు పౌర్ణమి సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ గుల్ మోర్ పార్క్ శిరిడి సాయి బృందావనం క్షేత్రంలో ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవేంద్ర శర్మ, గుల్మోహ‌ర్ పార్క్ అధ్యక్షుడు షేక్ కాసిం, ఆర్కే సాయన్న ముదిరాజ్ ల‌ను బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బిల్డర్ వెంకటేశ్వర్లు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా యోగా గురువు గారెల వెంకటేష్ కి భగవద్గీత గ్రంథం అందించారు. అనంతరం రామ‌చంద్ర యాద‌వ్ మాట్లాడుతూ ఎవ‌రికైనా త‌ల్లిదండ్రులే మొద‌టి గురువులు అని అన్నారు. మ‌న‌కి విద్యాబుద్ధులు చెప్పే గురువుల‌ను కూడా స‌న్మానించుకోవాల‌న్నారు. స‌మాజంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని గౌర‌వించాల‌ని, భ‌గ‌వ‌ద్గీత‌ను అంద‌రూ చ‌ద‌వాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో లింగంపల్లి ముఖ్య నాయకులు ఎన్ ఎన్ రెడ్డి, ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి ,యోగ గురువు వెంకటేష్ ముదిరాజ్, ఎన్ ఎన్ రెడ్డి టెక్స్టైల్ బోటిక్ మెన్స్ షాప్ ప్రోప్రైటర్ కుషన్ రెడ్డి, సాయి బృందావన్ సాయి సేవకులు ఆగమయ్య గౌడ్, నారాయణ, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here