శేరిలింగంపల్లి, జూలై 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల పరిధిలోని గౌలిదొడ్డి గ్రామ పరిధిలో ఉన్న బసవతారక నగర్‌ను సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్, సామెల్, సిపిఎం జిల్లా నాయకుడు రజాక్ పాషా, ఎల్లేష్, సిపిఎం శేలింగంపల్లి కార్యదర్శి చల్లా శోభన్, మండల నాయకుడు కొంగరి కృష్ణ, సిపిఐ మండల కార్యదర్శి రామకృష్ణ, అధ్యక్షుడు చందు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్థానికంగా నివాసం ఉంటున్న పేదల గుడిసెలు పోకుండా ఉండడం కోసం తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.