- 11 వ రోజు ఉచిత కంటి పరీక్షల శిబిరంలో ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : నియోజకవర్గంలో ఉన్న ప్రతి బస్తీ, కాలనీలలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆ ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్ తెలిపారు.
ఇందులో భాగంగానే ఆల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్, సిక్కుల బస్తి, మొగులమ్మ బస్తీలలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించి దాదాపు 500 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి బస్తీ, కాలనీలలో ఆనవాయితీగా ప్రతిసారి సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు ఏర్పాటు చేసి కంటి అద్దాలు, కంటి ఆపరేషన్లు చేయడం ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. కార్యక్రమంలో వినోద్ రావు, నరసింహ చారి, ఆంజనేయులు యాదవ్, కృష్ణ గౌడ్ ,సందీప్ గౌడ్, సురేష్, సుధాకర్, ఎత్తరి రమేష్, చాంద్ భాయ్, విష్ణువర్ధన్ రెడ్డి, నర్సింగ్ నరేష్ సైదమ్మ, అనూష పాల్గొన్నారు.