- డబుల్ ఇండ్లు పొందిన లబ్దిదారులతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆత్మీయ సమావేశం
నమస్తే శేరిలింగంపల్లి: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కేటాయింపు కోసం 15న ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించిన విషయం విదితమే. అయితే శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఎంపికైన 500 మంది లబ్దిదారులు వివేకానందనగర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
కార్పొరేటర్లు రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్ , జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించి, అభినందించారు ప్రభుత్వ విప్ గాంధీ. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్దిదారురాలు మాట్లాడుతూ తమ ఇంట్లో నిజమైన పండుగ రోజు ఇదని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని, పేదలకు దైవంతో సమానమని, ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి స్వంత ఇంటి కల నెరవేర్చిన గొప్ప మనసున్న నేత లని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఈ రోజు నిజమైన పండుగ వాతావరణం నెలకొందని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.