పార్టీలకతీతంగా, ప్రాంతాలకతీతంగా సేవలందించడమే లక్ష్యం

  • 16వ రోజు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
  • వేముకుంటలో కంటి అద్దాలు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : ప్రజాసేవ చేయడానికి పదవులు, పార్టీలు, ప్రాంతాలు అవసరం లేవని, సేవ చేయాలనే దృఢ సంకల్పం ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చునని నిరుపిస్తున్నది సందయ్య మెమోరియల్ ట్రస్ట్.

ఇందులో భాగంగా ఆ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్ ఆద్వర్యంలో చందానగర్ డివిజన్ వేముకుంటలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. శిబిరానికి వచ్చని పేదలకు చికిత్స అనంతరం అవసరమైన దాదాపు 500 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన కంటి వెలుగు అద్దాల కంటే సందయ్య మెమోరియల్ ట్రస్ట్ అద్దాలే శభాష్ అని మెచ్చుకుంటున్నారని మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చి రెడ్డి, రామ్ రెడ్డి , గౌస్ , కృష్ణ దాస్, చందర్ యాదవ్ , శ్రీనివాస చారి, ఆలీ, రాజన్, కాజా, పద్మ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here