నమస్తే శేరిలింగంపల్లి : ఆరంభ టౌన్షిప్ లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి అన్నారు. అయితే అంతకుముందు ఎంపీ జి. రంజిత్ రెడ్డిని తన నివాసంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అసోసియేషన్ లో నెలకొన్న సమస్యల గురించి చర్చించారు.
దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, గోపాల్ యాదవ్, రాజేష్, జనార్ధన్, సాయిరాం, నయుముద్దీన్ పాల్గొన్నారు.