నమస్తే శేరిలింగంపల్లి : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ గా నూతనంగా నియమితులైన హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరదల నరేష్, బీజేపీ ఓబీసీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ప్రభాకర్ యాదవ్, ఆర్ ఆర్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ డిఎస్ ఆర్ కె ప్రసాద్, సత్యనారాయణ, గిరి, ప్రశాంత్, పృథ్వి పాల్గొన్నారు.