- కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ నుండి వివినగర్ డివిజన్, హైదర్ నగర్ డివిజన్, మియాపూర్ డివిజన్ మీదుగా చందానగర్ డివిజన్ వరకూ కొనసాగిన బైక్ ర్యాలీ విజయవంతమైంది.
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్, ఎంబీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ జేరిపాటి జైపాల్, శేరిలింగంపల్లి ఇన్చార్జి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ పది సంవత్సరాల బిజెపి పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అభివృద్ధి అనే మాట పక్కకు పెట్టారని, శేరిలింగంపల్లిలో కేంద్ర ప్రభుత్వం చే ముడిపడి ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ “ఈ పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మరొకసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని శేరిలింగంపల్లి ఓటర్స్ ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని అన్ని డివిజన్లో నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీ సోదరులు, మహిళా సోదరీమణులు, యువ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, సేవాదళ్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.